సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సాయి పల్లవికి చెందిన న్యూస్???
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి.. తాను ఓ వెబ్ సైట్ ద్వారా పని చేయకుండా సంపాదిస్తున్నానని, రోజుకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు నా అకౌంట్లో పడిపోతూ ఉంటాయని చెప్పిందట. దాన్ని ఆధారంగా చేసుకుని ఆర్బీఐ చర్యలు తీసుకుంటోందనే వార్త వైరల్ అవుతోంది. అంతేకాదు, ఈ వార్తను సదరు ఛానెల్ టెలీకాస్ట్ చేయలేదని, ఇదీ ఆమె చెప్పిన విషయం అంటూ.. ఏకంగా ఓ నేషనల్ న్యూస్ పేపర్లో రాసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా హల్ చల్ చేస్తోంది. అయితే, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. సోషల్ మీడియాలో ఓ ఫేక్ ప్రమోటెడ్ పోస్టు ఈ అవాస్తవ ప్రచారానికి కారణం అయ్యింది. వాస్తవానికి ఆమె పేరుతో ఓ ఫేక్ వెబ్ సైట్ ఈ వార్తను రాసింది. అదీ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లోగో. ఇది నిజం అనుకుని చాలా మంది సోషల్ మీడియాలో ఆ వార్తను ప్రచారం చేశారు. అయితే, ఆ వార్తలన్నీ కేవలం ఫేక్ ప్రచారాలుగా నిపుణులు తేల్చారు. ఇలాంటి వార్తలు చూసి మోసపోకూడదని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఫేక్, ప్రమోటెడ్ పోస్టులను క్లిక్ చేయడం ద్వారా బ్యాంక్ పాస్ వర్డ్స్, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు సైబర్ నేరస్తుల చేతికి చిక్కే అవకాశం ఉంటుందని సైబర్ నిపుణులు చెప్తున్నారు. ఈ డీటైల్స్ వారికి వెళ్లగానే ఖాతాల్లోని డబ్బులు ఖాళీ కావడం ఖాయం. అందుకే ఇలాంటి ఫేక్ పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే సైబర్ నేరస్తుల వలలో చిక్కి ఉన్నదంతా కోల్పోవడం పక్కా అంటున్నారు.