మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో రూపొందిన భీమా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మాళవికా శర్మ , ప్రియ భవాని శంకర్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.
ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు నైజాం ఏరియాలో 76 లక్షల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 44 లక్షలు ... ఏపీ లో 88 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు 2.08 కోట్ల షేర్ ... 3.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 25 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 2.33 కోట్ల షేర్ ... 4.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఈ మూవీ 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ మరో 9.67 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. మరి ఈ మూవీ రాబోయే రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.