వేణు స్వామి.. టాలీవుడ్ కి ఈ పేరు పరిచయం అవసరం లేని పేరు.ఇండస్ట్రీకి చెందిన వాడు కాదు పోనీ ఇతర ఇండస్ట్రీలకి చెందిన వాడు కూడా కాదు. జస్ట్ ఒక జ్యోతిష్కం చెప్పే జ్యోతిష్యుడు. కానీ ఈయన పాపులారిటీ మాత్రం హీరో లెవెల్లో ఉంటుంది. నిత్యం స్టార్ హీరోలపై కామెంట్స్ చేస్తూ మరింత పాపులర్ అవుతున్నాడు వేణు స్వామి. సమంత మరియు నాగచైతన్య పెళ్లి చేసుకున్నప్పుడే వారిద్దరూ విడిపోతారు అని చెప్పి ఒక సంచలనం సృష్టించాడు.ఇక అనంతరం వారు విడిపోవడంతో వేణు స్వామి చెప్పే మాటలు అన్నీ నిజమేనంటూ ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోయిన్లు ఈయనతో ప్రత్యేక పూజలు కూడా జరిపించుకుంటున్నారు. ఇక ఇటీవలే ప్రభాస్ పై వేణు స్వామి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సలార్ సినిమా ఫ్లాప్ అవుతుందని.. ప్రభాస్ ఆరోగ్యం బాగోదు అంటూ కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ చూసి ప్రతి ఒక్కరూ మండిపడ్డారు కూడా. ముఖ్యంగా ఈ కామెంట్స్ పై శ్యామలాదేవి స్పందించడంతో ఇవి మరింత రచ్చగా మారాయి. తాజాగా మరోసారి ఓ హీరోయిన్స్ పందిస్తూ వేణు స్వామి పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.మరి ఆ హీరోయిన్ ఎవరు? ఏమని వ్యాఖ్యలు చేసింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుషిత కలపు గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోయినా చిన్న చిన్న సినిమాలలో నటిస్తూ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ అర్జున్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తుంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్ కి కూడా హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సంవత్సరం ముందు నీ దగ్గరికి వచ్చి నేను ముందే చెప్పాను.
ఒక సంవత్సరం తరువాత ని దిశ మారుతుందని అంటూ క్రెడిట్ కొట్టడానికి ప్రయత్నించాడు కదా ఆయన ఎవరో మీకు తెలుసు? దీనిపై మీరు ఎలా స్పందిస్తారు అని యాంకర్ ప్రశ్నించగా..' నిజానికి నేను ఇష్యూ అయినా తరువాత ఆయనని కలిసా. నేను అదే అనుకున్నా ఇష్యూ అయిన తర్వాతే కలిసాను కదా ముందు కలవలేదు కదా ఎందుకలా అంటున్నారు అని. ఇష్యూ తర్వాత కలిసి నేను చెప్పడం వల్లే ఫేమస్ అయ్యింది అనడం చాలా తప్పు ' అంటూ ఒక్కమాటలో వేణు స్వామి పరువు గంగలో కలిపేసింది కుషిత. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన కొందరు.. గొర్రె బిడ్డల్లాగా వేణు స్వామిని ఫాలో అవ్వకుండా ఉండండి. లేదంటే రానున్న రోజుల్లో మీ పరిస్థితి కూడా ఇంతే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.