కాశ్మీరి సంప్రదాయ దుస్తులు ధరించిన అలనాటి తార...!!
రాధిక.. తమిళ సినీ నటుడు… కమెడియన్ MR రాధ కుమార్తె. ఆమె నటించిన శ్రీలంక గీతా లోనిది ఈ ఫోటో. రాధిక తన విద్యాభ్యాసం భారత్, శ్రీలంక, యుకెలో పూర్తి చేసింది.1978 తమిళ చిత్రం ఇష్కిష్కే పోమియా రైల్ తో సినీరంగ ప్రవేశం చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించారు. ఇప్పటివరకు ఆమె 200కు పైగా ల్లో కనిపించింది. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ వంటి అగ్రనటులందరితో కలిసి నటించింది. రాధిక, చిరంజీవి కాంబోలో అభిలాష, దొంగ మొగుడు, జ్వాల, పట్నం వచ్చిన పతివ్రతలు, న్యాయం కావాలి, గూడఛారి నం.1, పులి బెబ్బులి, యమకింకరుడు, పల్లెటూరి మొనగాడు, కిరాయి రౌడీలు, హీరో, మొండిఘటం, ఆరాధన ఇంకా మరెన్నో లు వచ్చాయి.
2001లో ఫిబ్రవరి 4న తమిళ నటుడు శరత్ కుమార్ ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరి కాంబోలో నమ్మ అన్నాచి, సూర్య వంశం లు వచ్చాయి. నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగాను గుర్తింపు తెచ్చుకున్నారు రాధ. రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ చైర్మ పర్సన్ రాధిక. అలాగే రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. 2006లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె భర్త ఆర్. శరత్‌కుమార్‌తో కలిసి ఏఐఏడీఎంకేలో చేరారు. అయితే అదే ఏడాది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. ఆమె 2007 నుండి ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కట్చి కార్యకర్తగా ఉన్నారు.