మా నాన్న డైరెక్షన్లో.. అస్సలు నటించను.. ఆకాష్ పూరి కామెంట్స్?
అలాంటి వారిలో సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు పూరి ఆకాష్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి తన నటనతో ఆకట్టుకున్నాడు. మాయాబజార్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక రొమాంటిక్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అనుకున్నాడు. కానీ ఎందుకో సరైన సక్సెస్ మాత్రం కొట్టలేకపోయాడు అని చెప్పాలి. అయితే ఆకాష్ పూరి ఇలా సక్సెస్ కాకపోవడానికి కారణం.. తండ్రి పూరి జగన్నాథ్ నుంచి అతనికి పూర్తిస్థాయి మద్దతు లేకపోవడమే అని ఎన్నో రూమర్స్ కూడా అప్పుడప్పుడు తెర మీదకి వస్తూ ఉంటాయి. అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆకాష్ పూరి ఇక తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.
మీ నాన్న దర్శకత్వంలో ఎప్పుడు సినిమా చేయబోతున్నారు అంటూ ప్రశ్నించగా షాకింగ్ సమాధానం ఇచ్చాడు. నేను మా నాన్న దర్శకత్వంలో సినిమా చేయను. ఇదే నా నిర్ణయం. ఫస్ట్ నేను నటుడిగా ఒక హీరోగా ప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో సినిమా చేస్తాను. మా నాన్న డైరెక్షన్లో నటించాలనే కోరిక కంటే కార్తికేయ 2, హనుమాన్ లాంటి గొప్ప గొప్ప సినిమాలలో నటించాలనే కోరిక ఎక్కువగా ఉంది. నేను ఇప్పటికీ పిల్లాడిలా ఉంటానని కంప్లైంట్ ఉంది. ఇక హీరోగా సెట్ అయిన తర్వాత విలన్ లాంటి పాత్రలు చేయడం విషయంలో కూడా ఆలోచిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని.. ఎలాంటి లవ్ ఎఫైర్స్ లేవు అంటూ ఆకాష్ పూరి తెలిపాడు.