ఎ మాస్టర్ పీస్: అదరగోడుతున్న సూపర్ విమెన్ పోస్టర్?

Purushottham Vinay
సూపర్ హీరో సినిమా "ఎ మాస్టర్ పీస్" విడుదల ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ ఆసక్తిని పెంచింది.ఈ హై-ఆక్టేన్ అడ్వెంచర్‌ మూవీలో స్నేహా గుప్తా హీరోయిన్ గా సూపర్ విమెన్ పాత్రలో నటిస్తుంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి విడుదలైన స్నేహ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.మెస్మరైజింగ్ గా ఉంది.ఈ పోస్టర్ లో స్నేహ అద్భుతమైన బ్లూ అండ్ ఎల్లో బాడీసూట్‌ను ధరించి సూపర్ విమెన్ పోజ్ లో అదరగోడుతుంది. ఈ పోస్టర్ హాలీవుడ్ రేంజ్ లో వుంది.అందులో ఆమె చేయి మండుతున్న శక్తిని కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది.ఈ పోస్టర్ ఆమె పాత్రలో ఉన్న పవర్ ని సూచిస్తుంది. స్నేహ గుప్తా మంచి డ్యాన్సర్ గా గుర్తింపు పొందింది. రీసెంట్ గా ఢీ షోలో ఆమె చేసిన పెర్ఫార్మన్స్ యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆమె సూపర్ హీరో సినిమా ఎ మాస్టర్ పీస్ లో సూపర్ విమెన్ గా నటిస్తుంది. ఆమె లుక్ ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందిస్తుంది. 



ఇక "ఎ మాస్టర్ పీస్" సినిమా విషయానికి వస్తే.. ఇది హాలీవుడ్ అవేంజర్స్ తరహా లాంటి సూపర్ హీరో సినిమా. ఈ సినిమాని దర్శకుడు సుకు పూర్వాజ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో స్నేహతో పాటు చాలా మంది కొత్త నటులు కూడా నటిస్తున్నారు.ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట. జూలై నెలలో ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా యాక్షన్, అడ్వెంచర్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో మనీష్ కుమార్ సూపర్ హీరోగా నటిస్తున్నారు. సూపర్‌ హీరోయిన్‌గా స్నేహ గుప్తా నటిస్తుంది. ఆమె పాత్రను కూడా హీరోకి సమానంగా చాలా చక్కగా చూపించబోతున్నారని రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది.ఈ సినిమా కోసం కొత్త కంటెంట్ సినిమాలని ఎంకరేజ్ చేసే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి సరికొత్త కంటెంట్ తో వస్తున్న ఈ మూవీ ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: