గామీ: అక్కడ మాత్రం చాలా కష్టమే?
ట్రైలర్‌తోనే అంచనాలు పెంచిన ఈ సినిమా తొలిరోజు ఏకంగా రూ.9 కోట్లు, రెండు రోజు రూ.6 కోట్లు, మూడు రోజు రూ.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంటే మూడు రోజుల్లో ఏకంగా రూ.20.3 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు స్వయంగా నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు.సరికొత్త కంటెంట్ తో ప్రయోగాత్మక కథతో తీసిన ఈ 'గామి' చిత్రానికి మూడు రోజుల్లో ఈ రేంజులో కలెక్షన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఈ వారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి థియేటర్లలోకి రావట్లేదు కాబట్టి ఈ సినిమా మరిన్ని కోట్లు రాబట్టుకోవడం గ్యారంటీ. వీకెండ్ అయ్యేసరికే దాదాపు అన్నిచోట్ల లాభాల్లోకి వెళ్లిపోయిన 'గామి' సినిమా ఓవర్సీస్‌లో మాత్రం మంచి నంబర్స్ నమోదు చేయలేక స్లోగా రన్ అవుతుంది. ఎందుకంటే అక్కడ డ్యూన్ 2, సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ సునామిలో గామీ కొట్టుకుపోయింది.అలాగే కుంగ్ ఫు పాండా 4 కూడా రిలీజ్ కాబోతుంది. అందువల్ల గామీ సినిమా యూ ఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న వసూళ్లు నమోదు చేయలేకపోతుంది.మరి లాంగ్ రన్‌లో ఈ సినిమా మిలియన్ డాలర్స్ మార్క్ అందుకుంటుందో లేదో చూడాలి.