సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిహారిక కామెంట్స్..!!

murali krishna
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఇటీవల భర్తతో విడాకులు తీసుకుని తన లైఫ్‌ను ఒంటరిగా లీడ్ చేస్తుంది.వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఓ నిర్మాణ సంస్థను ప్రాంరంభించి వెబ్‌సిరీస్‌లు, సినిమాలు తెరకెక్కిస్తుంది. నిహారిక నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తుంది. రోజుకో ఫొటోషూట్ షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. తనపై ఎటువంటి ట్రోల్స్ వచ్చిన పట్టించుకోకుండా తను అనుకున్నది చేసుకుంటూ పోతుంది.తాజాగా, మెగా డాటర్ నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఇందులో భాగంగా అభిమానులు పలు ప్రశ్నలు వేయగా ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. అయితే ఓ నెటిజన్ మీ లైఫ్ ఎలా సాగుతుంది అనగా.. ఫెన్‌టాస్టిక్‌గా ఉందని చెప్పింది. అలాగే మీరు కాఫీ లవరా అని అడగ్గా.. బిగ్ టైమ్ అంటూ సమాధానమిచ్చింది. అయితే ఓ వ్యక్తి మీ తమిళ మూవీ గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వండి అని అడగడంతో.. మార్చి 17న షూటింగ్ ప్రారంభం అవుతుందని గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం నిహారిక సమాధానాలు నెట్టింట వైరల్ అవుతుండగా అది చూసిన వారంతా ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. రీ ఎంట్రీలో సక్సెస్ అందుకోవాలని అభిప్రాయపడుతున్నారు.మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగారు అనంతరం పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే ప్రస్తుతం భర్త నుంచి దూరంగా ఉన్నటువంటి నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఒకవైపు నిర్మాతగా సినిమాలను నిర్మిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. హీరోయిన్గా కూడా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నిహారిక కుకింగ్ షో కి యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ తనకు ఇటీవల కాలంలో తిండి పిచ్చి బాగా ఎక్కువైపోయిందని తెలిపారు. పప్పు చారు అన్నం చాలా ఇష్టంగా తింటానని తెలిపారు. ఇకపోతే డబ్బులు దాచుకొని మరి తాను వెకేషన్ వెళ్తున్నానని ఈమె తెలియజేశారు. నేను ఏదైనా ఒక పని చేయాలి అంటే ముందుగా ప్లాన్ వేసి చేయనని అప్పటికప్పుడు నాకు ఏమి నచ్చితే అదే పని చేస్తానని తెలిపారు. ఇక నాకు సినిమాలలో నటించడం అంటే చాలా ఇష్టం . ఇక నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను కదా అని డైరెక్ట్ గా సినిమాల్లోకి వెళ్లడానికి ఇష్టపడనని నన్ను కూడా ఆడిషన్ కి పిలిస్తే చాలా సంతోషంగా వెళ్తానని తెలిపారు. ఇకపోతే ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నీ నాకు ఎంతగానో నచ్చాయి. కానీ నాకు కమర్షియల్ సినిమాలు రాలేదని, అలాంటి సినిమాలలో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. ఇకపోతే ఈ కుకింగ్ షోలో భాగంగా తన నాన్నమ్మ, అలాగే పెద్దమ్మ సురేఖ తో పాటు వదిన ఉపాసన ని కూడా తీసుకువచ్చి వారి చేత వంట వండించాలని అనుకుంటున్నాను. అయితే ఏం జరుగుతుందో చూద్దాం అంటూ ఈ సందర్భంగా నిహారిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: