నటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో పలు సినిమాల్లో చేసి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఉంగరాల జుట్టుతో కుర్రకారును తన వైపు తిప్పుకుంటుంది. ఈ భామ అందం, నటనతో పాటు డ్యాన్స్‌లో కూడా ఇరిగదీసేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఈగల్ సినిమాతో వచ్చింది. ఇక, మరోసారి టిల్లు స్క్వేర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు కూడా యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు తమిళంలో తను నటించిన సైరెన్ మూవీపై ఓ వెబ్‌సైట్ ఇచ్చిన నెగెటివ్ రివ్యూపై అదిరిపోయే కౌంటర్ వేసింది.అనుపమ తమిళంలో సైరెన్ సినిమాలో అదరగొట్టేస్తోంది. అయితే ఈ చిత్రంపై ఓ వెబ్ సైట్ నెగెటివ్ రివ్యూ ఇచ్చింది. దానికి ఈ అమ్మడు సరైన రీతిలో కౌంటర్ ఇచ్చింది. ఓ చెవిటి, మూగ అమ్మాయి పాత్రకు డైలాగ్స్ కూడా ఉంటాయా? అని కౌంటర్లు వేసింది. ఈ సందర్భంగా ఆ వెబ్ సైట్‌తో ఇన్ స్టాలో చిట్ చాట్ చేసింది. ఆ చాట్‌ను కూడా తన ఇన్ స్టా స్టోరీలో పెట్టేసింది. ఇలా బేస్ లెస్ వార్తలు రాస్తారని అందరికి తెలియాలిగా.. అందుకే వీటిని ఇన్‌స్టా స్టోరిలో పెడుతున్నా అంటూ మరీ రాసుకొచ్చింది.ఓ ప్రముఖ వెబ్ సైట్ అనుపమ నటించిన సైరెన్ మూవీ రివ్యూ రాసింది. అందులో నటి అనుపమ గురించి ప్రత్యేకంగా రాశారు. అనుపమ ఇటీవలె రెండు సినిమాల్లో కనిపించారు. అందులో ఈగల్ సినిమా ఒకటి. ఈగల్‌లో అనుపమ సైడ్ క్యారెక్టర్ చేసింది. ఆ సినిమా వల్ల ఆమెకు ఎటువంటి ప్రయోజనం రాలేదు. మరో సినిమా సైరెన్. ఈ సినిమాలో జయం రవి హీరో గా నటించారు. ఈ సినిమాలో మరో నటి కూడా ఉంటుంది. ఆమె కీర్తీ సురేష. కీర్తి సురేష్ ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. అనుపమ మాత్రం కేవలం కొన్ని సీన్లకు మాత్రమే పరిమతమయింది. అసలు ఈ సినిమాలో ఆమెకు డైలాగ్స్ కూడా లేవు అని రాసుకొచ్చారు. తన పాత్రపై ఇలా రాయడంపై అనుమప అదిరిపోయే కౌంటర్ వేసింది.మీరు ఓ మూగ చెవిటి పాత్ర నుంచి కూడా మాటలు, డైలాగ్స్ ఆశిస్తున్నారా? గ్రేట్ అంటూ వెబ్‌సైట్ వారికి అనుపమ కౌంటర్లు వేసింది. దీన్ని బట్టి చూస్తే సైరెన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ డెఫ్ అండ్ డంబ్. అయినా ఆ పాత్రకు ఒక్క డైలాగ్ కూడా లేదని రాయడంతో అనుపమ ఇలా విరుచుకుపడింది. దీంతో సదరు వెబ్ సైట్ టీం వెంటనే స్పందించింది. ఆ న్యూస్‌ను ఎడిట్ చేయిస్తామంటూ చెప్పుకొచ్చింది. దీని గురించి నేను నా ఇన్‌స్టా స్టోరిలో పెడతా.. అంటూ ఛాట్ మొత్తం తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టింది.