ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్న సురేఖా వాణి..!!

murali krishna
సురేఖా వాణి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు ఏడాదికి కనీసం అరడజను సినిమాలు చేసే ఈమె దాదాపుగా చాలా మంది స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.ఇప్పుడు సినిమాలను కాస్త తగ్గించి కూతురితో కలిసి లైఫ్ను బాగా ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి షేర్ చేసుకుంటూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.భర్త చనిపోయాక 40ఏళ్ల వయసులో 20ఏళ్ల కుర్ర భామలా అందాలను ఆరబోస్తూ ఓ వైపు కవ్విస్తూనే మరోవైపు విమర్శలను మూటగట్టుకుంటోంది. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వెక్కి వెక్కి ఏచ్చింది. ఆ కోరికతో ఎన్నో రాత్రులు ఒంటరిగా గడిపానంటూ, ఒక్క ఛాన్స్ కావాలి అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతోంది. దాని గురించే ఈ కథనం.టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అమ్మగా, అక్కగా, పిన్నిగా, వదినగా ఇలా ఎన్నో పాత్రలో నటించి ఆకట్టుకుంది నటి సురేఖా వాణి. అయితే ఈమె గత కొంతకాలంగా కూతురితో కలిసి తాను జీవించే లైఫ్ స్టైల్పై ఎన్నో విమర్శలను ఎదుర్కొంటోంది. డ్రగ్స్ కేసులోనూ ఈమె పేరు వినిపించింది. అయితే తాజాగా దీనిపై ఆమె మాట్లాడింది. తన చనిపోయిన భర్త గురించి కూడా మాట్లాడింది.ఒక్క అవకాశం కావాలి ప్లీజ్ : నా భర్త నన్నెంతో గౌరవించాడు. నేను కూడా అతడిని బాగా చూసుకున్నాను. అతడు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను. కానీ నా భర్త తరఫున కుటుంబం వాళ్లు నన్ను తప్పుగా భావించారు. అతడి ఆరోగ్య పరిస్థితిని చూసి చాలా ఏడ్చాను. తను నా జీవితంలో నుంచి వెళ్లిపోయాక చాలా బాధపడ్డాను. ఆ దేవుడు ఒక రోజు, ఒక గంట నా భర్తతో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండని కోరుకుంటున్నానుకనీసం కలలో అయినా కనపడితే మాట్లాడాలని ఉంది. ఎందుకంటే నేను అతడిని అడగాల్సినవి కొన్ని ఉన్నాయి. పంచుకునేవి ఉన్నాయి. క్షమించమని అడగాలని ఉంది. అతడి ప్రాణాలతో లేకపోయినా చాలా చెప్పుకున్నా. లోలోపల చాలా ఏడ్చాను. అతడు నా మాట వింటాడని భావిస్తున్నాను. తనంటే నాకు చాలా ఇష్టం. అని వెక్కి వెక్కి ఏడుస్తూ భావోద్వేగానికి గురైంది. భర్త చనిపోయాక చాలా కాలం తాను డిప్రెషన్లోకి వెళ్లినట్లు అప్పుడు తన కూతురు తనకు అండగా నిలిచిందని చెప్పుకొచ్చింది..రెండో పెళ్లిపై కామెంట్స్ : తన కూతురు సుప్రితతో పాటు తన డ్రెస్సింగ్పై వచ్చే విమర్శల గురించి కూడా రియాక్ట్ అయింది సురేఖ వాణి. ఎవరికి నచ్చినట్టు వారిని ఉండనివ్వాలని, ఎవరికి నచ్చిన బట్టలు వారిని వేసుకోనివ్వాలని సింపుల్‌గా సమాధానమిచ్చింది. రెండో పెళ్లి, రిలేషన్‌షిప్ లాంటి ఆలోచనలు కూడా తనకూ ఏమీ లేవని అసలు రిలేషన్‌షిప్‌ అంటేనే భయమేస్తుందని, వాటిపై నమ్మకం లేదని కూడా చెప్పింది. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణల గురించి కూడా మాట్లాడింది సురేఖ వాణి. ఈ ఆరోపణల వల్ల తాను నెల రోజుల పాటు సరిగా తిండి తినలేదని గుర్తుచేసుకుంది. ఆ సమయంలో తనకు ఎవరూ అండగా నిలవలేదని, తన కూతురితో కలిసిఏడ్చినట్లు తెలిపింది.సురేఖ పెద్దగా సినిమాలు చేయపోయినా లగ్జరీ లైఫ్ను అనుభవిస్తుంది, ఎవరితోనే రిలేషన్ పెట్టుకుంది అని వస్తున్న విమర్శలపై మాట్లాడింది ఆమె. తెలుగులో సినిమాలు చేయకపోయినా తమిళంలో ఏడాదికి రెండు మూడు చిత్రాలు చేస్తానని దానితోనే సర్వైర్ అవుతున్నానని చెప్పింది. తన ముఖంలో, డ్రెస్సింగ్ స్టైల్లో రిచ్నెస్ కనిపిస్తోందని, అందుకే అందరూ అలా అంటున్నారని పేర్కొంది. తాను కొన్న కారు కూడా ఈఎమ్ఐలో కొనుగోలు చేసిందని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: