గౌతమ్ కు అంతా ఆమె పోలికేనా అని అంటున్న అభిమానులు...!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలోనూ ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ ఒకటి అని చెప్పాలి.ఘట్టమనేని హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కృష్ణకు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ ప్రస్తుతం మన మధ్య లేరు ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రెండు సంవత్సరాల క్రితం మరణించిన సంగతి తెలిసిందే.ఇలా కృష్ణ గారు మన మధ్య లేకపోయినా ఆయన పేరు చెబితే పూనకం వచ్చే అభిమానులు ఇప్పటికీ ఉన్నారని చెప్పాలి. ఇక కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి మహేష్ బాబు బాల నటుడిగా అడుగు పెట్టారు. ఇలా బాల నటుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కృష్ణకు కొడుకు పాత్రలలోను అలాగే తమ్ముడి పాత్రలలో కూడా నటించి మెప్పించారు. అనంతరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి మహేష్ బాబు ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.  ఇలా ఇండస్ట్రీలో మహేష్ బాబు అంచలంచలుగా ఎదుగుతూ కృష్ణ పేరు ప్రఖ్యాతలను నిలబెట్టారు ప్రస్తుతం ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు ఇతర చిత్ర బృందంతో కలిసినప్పుడు చాలా సరదాగా మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటారు. అయితే మహేష్ బాబు మాత్రమే కాకుండా కృష్ణ కూడా నలుగురిలో కలిసినప్పుడు చాలా జోవియల్ గా సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. ఇలా వీరిద్దరూ మీడియా సమావేశంలో కానీ లేదా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఎంతో సరదాగా అందరిని నవ్విస్తూ నవ్వుతూ ఉంటారు కానీ వీరికి ఉన్నటువంటి ఈ లక్షణాలు మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కి మాత్రం రాలేదని తెలుస్తుంది.  మహేష్ బాబు మాత్రమే కాకుండా నమ్రత సితార కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎక్కడికి వెళ్లినా చాలా చురుగ్గా కనిపిస్తూ ఉంటారు కానీ గౌతం మాత్రం సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటారు. ఇలా గౌతమ్ మౌనంగా ఉండడంతో తనకు తన తండ్రి తాతయ్య అలవాట్లు రాలేదని అభిమానులు భావిస్తున్నారు. మరి గౌతమ్ ఇలా సైలెంట్ గా తన పనులు తాను చేసుకుని వెళ్లడం అనేది బహుశా తన నాయనమ్మ కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి నుంచి వచ్చిందేమోనని, తనకు తన నాయనమ్మ పోలికలే వచ్చాయని పలువురు అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: