పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ సినిమా స్పిరిట్. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. డ్రగ్స్ నేపథ్యంలో అలాగే ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగా కచ్చితంగా 2000 కోట్ల రూపాయలను వసూలు చేయాల్సిందే అని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాతో రాజమౌళి ఫిక్స్ చేసిన టార్గెట్ ను అందుకోవాలి అని సినిమాకి
సంబంధించిన పనులను శరవేగంగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు సందీప్ రెడ్డి. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డివంగా చేస్తున్న నెక్స్ట్ సినిమా స్పిరిట్ ప్రభాస్ ఇందులో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అంటూ అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇయర్ ఎండ్ కి స్టార్ట్ అవుతుందని దర్శకుడు రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. 'స్పిరిట్' లో ప్రభాస్ తొలిసారి పోలీస్ పాత్రలో అలరించనున్నాడు. యానిమల్ చిత్రం బీబత్సమైన
వసూళ్లు సాధించటంతో నిర్మాతలకు సైతం భారీగా లాభాలు వచ్చాయి. ఈ నేపధ్యంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం నిమిత్తం సందీప్ వంగాకు ఎంత పే చెయ్యబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సందీప్ వంగాకు 125-150 కోట్లు దాకా ముడుతుందని సమాచారం. అయితే దాన్ని పెట్టుబడిలో తమ షేర్ గా పెట్టబోతున్నారని, లాభాలు వచ్చాక అందుకుంటారని చెప్తున్నారు. అదే విధంగా యానిమల్ చిత్రానికి 100 కోట్లుదాకా ముట్టిందని అంటున్నారు. దాంతో ఇప్పుడు ఇదే పద్దతి స్పిరిట్ చిత్రానికి కూడా అవలంబించబోతున్నారట.