టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులు అయినటువంటి శ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరి ముగ్గురు కాంబోలో ఇది వరకు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో "బ్రోచేవారెవరురా" అనే మూవీ రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకొని భారీ కలెక్షన్ లను రాబట్టింది. అలాగే వీరు బ్రోచేవారెవరురా సినిమాలో పండించిన కామెడీకి కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.
ఇకపోతే ఇప్పటికే మంచి గుర్తింపు కలిగిన ఈ కాంబోలో ప్రస్తుతం "ఓం భీమ్ బుష్" అనే సినిమా రూపొందుతుంది. ఇకపోతే వీరి ముగ్గురి కలయికలో వస్తున్న రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులలో మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం ఓ టీజర్ ను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల తేదీని మరియు సమయాన్ని ప్రకటించారు. ఈ సినిమా యొక్క ట్రైలర్ ను మార్చి 15 వ తేదీన సాయంత్రం 4 గంటల 59 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా టీజర్ సూపర్ గా ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.