మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సంవత్సరాల నుండి టాలీవుడ్ సినీ పరిశ్రమలో టాప్ హీరో లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే చిరంజీవి తన ఇంట్రెస్ట్ ను రాజకీయాల వైపు పెట్టడం మొదలు పెట్టాడు . అందులో భాగంగా ప్రజా రాజ్యం అనే పార్టీని స్థాపించి చాలా రోజుల పాటు ఆ పార్టీతోనే తన సమయాన్ని గడిపాడు . కానీ చిరంజీవి అనుకున్నం త స్థాయి లో ఈ పార్టీ సక్సెస్ కాకపోవడం ... అలాగే రాజకీయాల్లో కూడా ఆయన అనుకున్న స్థాయికి చేరకపోవడంతో రాజకీయాల కంటే కూడా సినిమాలే ముద్దు అని రాజకీయాలకు చిరు స్వస్తి చెప్పి ప్రస్తుతం వరుస సినిమాలతో తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.
ఇకపోతే వరుస సినిమా లతో తన కెరీర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న చిరు అప్పుడప్పుడు రాజకీయాల విషయాలపై కూడా తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటాడు . ఇక పోతే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో చిరంజీవి ఓటు హక్కు గొప్పతనాన్ని యంగ్ స్టార్స్ ఓటు హక్కును వినియోగించుకునే విధానం గురించి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. తాజాగా చిరంజీవి ... త్వరలో మన దేశ 18 వ లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. 18 ఏళ్ళు నిండిన వారు మొట్ట మొదటి సారి ఓటు హక్కు పొందుతారు. మీ మొదటి ఓటును దేశ , రాష్ట్ర భవిష్యత్తు కోసం వినియోగించండి. తప్పనిసరిగా ఓటు వేయండి అని చిరు పిలుపునిచ్చాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.