అరవ డైరెక్టర్లనే నమ్ముకున్న సల్లు భాయ్?

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన సల్మాన్ ఖాన్ ఒకప్పుడు వరుస హిట్లతో టాప్ లో ఉండేవాడు. ఒకప్పుడు ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం 300 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటు వచ్చాడు. కానీ ఇప్పుడు బాయ్ సినిమాల మార్కెట్ కూడా తగ్గుతూ వస్తోంది. దానికి బోనస్ గా భాయ్ పై ట్రోల్స్ ఎక్కువయ్యాయి.ముఖ్యంగా రొటీన్ కమర్షియల్ సినిమాలు చెయ్యడం వల్ల అసలు ఓపెనింగ్స్  సరిగ్గా రావడం లేదు. దీన్ని బట్టి అతని పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ సొంత ఇండస్ట్రీలోని బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకులను కూడా పెద్దగా నమ్మడం లేదు. ఇప్పుడు కోలీవుడ్ దర్శకుల వైపు అతని ఫోకస్ పడినట్లుగా అర్థమవుతుంది. అయితే ఆ దర్శకుల టైం కూడా ప్రస్తుతం అంత బాలేదు.సల్మాన్ ఖాన్ ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కిక్ 2 గా రాబోతున్న ఈ మూవీని ఈద్ కానుకగా విడుదల చేయాలని ఒక టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు.



 అయితే అంతా బాగానే ఉంది కానీ మురగదాస్ కూడా సక్సెస్ చూసి చాలా కాలమైంది. తమిళ్ ఇండస్ట్రీలో అతనితో ఇంతకుముందు బిగ్ హిట్స్  కొట్టిన హీరోలు ఎవరు కూడా అంతగా ఆసక్తిని చూపలేదు.విజయ్ తో చెయ్యాలనుకున్న ప్రాజెక్టును క్లోజ్ చేసేసారు. ఇక చివరకు మురగదాస్ స్టార్ హీరోల రేంజ్ నుంచి మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసే పరిస్థితికి వచ్చాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ తో అతను ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా దీపావళి పండుగకి విడుదల కానుంది. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో కిక్ 2 సినిమా చేస్తున్నాడు. శివ కార్తికేయన్ సినిమా పూర్తి అయ్యాక సల్మాన్ సినిమా ఉంటుందని సమాచారం తెలుస్తుంది.సల్మాన్ ఖాన్ అయితే ఈ దర్శకుడిని చాలా గట్టిగానే నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు సల్మాన్ ఖాన్ మురగదాస్ కంటే ముందే తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తో ఒక సినిమాని స్టార్ట్ చేశాడు.ఇక అదే బిగ్ బుల్ సినిమా. విష్ణువర్ధన్ ఒకప్పుడు తమిళంలో అజిత్ తో బిల్లా ఇంకా ఆరంభం లాంటి సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: