మెగా డాటర్
నిహారిక గురించి అందరికీ తెలిసిందే.
నిహారిక పేరు వినగానే ముందుకు గుర్తుకు వచ్చేది ఆమె ఎనర్జీ. ఎప్పుడు నవ్వుతూ పక్క వాడిని కూడా నవ్విస్తూ యాక్టివ్ గా ఉంటుంది నిహారిక.చిన్నప్పట్నుంచి
సినిమా ప్రపంచంలో పెరగడంతో ఆటోమెటిక్‌గా తనకు సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. అందుకే ఆ రంగంలోకే అడుగుపెట్టింది. అలా మొదట
టీవీ షో చేసింది. ఢీ జూనియర్ షోకి యాంకర్ గా వర్క్ చేసింది. దీనికి నాగబాబు జడ్జ్ గా ఉన్నారు.
తండ్రి సపోర్ట్ గా ఆమె యాంకర్‌గా మెప్పించే ప్రయత్నం చేసింది. దాదాపుగా ఏడాదికి పైగానే యాంకర్‌గా పని చేసింది నిహారిక.అయితే ఈ షో చేయడానికి ఆమె అందుకున్న మొదటి పారితోషికం వివరాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడిచింది. ఢీ జూనియర్ షోకి తాను అందుకున్న మొదటి పారితోషికం 20వేలు అని తెలిపింది. ఎపిసోడ్ కి 20కే ఇచ్చేవారని చెప్పుకొచ్చింది నిహారిక. అప్పట్లో తాను పెద్దగా డిమాండ్ చేయలేదని, ఇచ్చినంత తీసుకున్నట్టు ఆమె తెలిపింది.
నిహారిక 2015లో ఢీ జూనియర్ షో చేసింది. ఆ సమయంలో ఎపిసోడ్‌కి 20వేలు అంటూ తక్కువేం కాదు. మంచిగానే దక్కిందని చెప్పవచ్చు. వెనకాల ఫాదర్ నాగబాబు ఉండటంతో ఆమెకి బాగానే వర్కౌట్ అయ్యిందని చెప్పాలి. అయితే వచ్చిన డబ్బుని జల్సాలకు ఖర్చు చేయలేదట. వాటి
నాన్న నాగబాబుకి ఇచ్చిందట. ఆయన తన పేరుతో సేవ్ చేశాడని వెల్లడించింది.
ఇక ఈ షో ద్వారా వచ్చిన మొత్తంతో నిహారికా ప్రొడక్షన్ బ్యానర్‌ని ప్రారంభించింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ ప్రారంభించి ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్‌ని నిర్మించింది. ఇందులో యాక్ట్ చేసింది కూడా. ఆ వెబ్ సిరీస్ బాగా ఆదరణ పొందింది. తెలుగులో మంచి ప్రశంసలు అందుకుంది. అలాగే
నిహారిక తనకు వచ్చిన పారితోషికంతో అమ్మా నాన్నలకు
గిఫ్ట్ లు ఇచ్చిందట. నాన్ననాగబాబుకి వెంటనే ఒక హెడ్ ఫోన్ కోనిచ్చిందట. తమకి ఇంట్లో ఒక్కటే
టీవీ ఉండేదట.
నాన్న ఎప్పుడూ అందులోనే పాటలు పెట్టుకుని వింటుండేవాడు, తమకి
టీవీ చూసే అవకాశం వచ్చేది కాదు. దీంతో హెడ్ ఫోన్ కోనిస్తే ఫోన్ లో పాటలు వింటూ రిలాక్స్ అయ్యేవాడని, అమ్మ నేను ఎంచక్క
టీవీ చూసుకునేవాళ్లమని తెలిపింది నిహారిక. తనకి ముక్కు పుడక అంటే చాలా ఇష్టం. అందుకే అమ్మకి గోల్డ్ ముక్కుపుడక
గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలిపింది.