బాలీవుడ్ అశ్వత్థామతో రికార్డ్స్ పగలడం పక్కా అట?

Purushottham Vinay
ఈమధ్య కాలంలో మన హిందూ మూలల ఆధారంగా వచ్చిన సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. బాహుబలి నుంచి మొన్న వచ్చిన కార్తికేయ 2, హనుమాన్ దాకా అన్ని సినిమాలు వండర్స్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఆ ప్రయత్నం వస్తుంది.బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు 'అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్‌' టైటిల్‌ ఖరారైంది. కన్నడ దర్శకుడు సచిన్‌ రవి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.వసు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా అధికారిక ప్రకటన కూడా వెల్లడైంది.డైరెక్టర్ సచిన్‌ రవి మాట్లాడుతూ- ''మహా భారతంలోని అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉంటారని ప్రతి హిందువుని నమ్మకం. మహాభారత కాలానికి చెందిన ఓ అమరుడు ఇప్పటి ఆధునిక కాలానికి వస్తే ఏం జరుగుతుంది? అనే అంశాలను ఈ మూవీలో చూపిస్తున్నాం'' అన్నారు. ''ప్రస్తుత పరిస్థితుల్లో అప్పటి లెజెండ్స్‌ యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ మూవీ కథనం ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ వెల్లడిస్తాం'' అని పేర్కొన్నారు నిర్మాత జాకీ భగ్నాని.



ఊహకు, వాస్తవాలకు మధ్య ఉండే అద్భుతమైన కథను, గాధను 'అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్' గా దర్శకుడు సచిన్ రవి చూపించబోతోన్నారు. 'అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్' అనే ఈ అత్యంత ప్రతిష్టాత్మక సినిమా హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ ఇలా ఐదు భాషల్లో భారీగా విడుదల కానుంది.హై యాక్షన్ ప్యాక్డ్ సీన్లతో సినిమాను చాలా అద్భుతంగా తీర్చి దిద్దబోతోన్నారు. అమర జీవిగా ఇన్ని వేల సంవత్సరాలు ఎలా బతికి ఉన్నాడు అనే పాయింట్‌ను చాలా ఇంట్రెస్టింగ్  చూపించబోతోన్నారు.ఈ సినిమా గతం, వర్తమానం మధ్య జరిగే యుద్దం అని చెప్పుకొచ్చారు. ఈ సీన్లు రోమాలు నిక్కబొడుచుకునేలా తెరకెక్కిస్తామని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా హిట్ అయితే బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ రికార్డ్స్ ఖచ్చితంగా బద్దలవడం పక్కా అట.పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్‌లు నిర్మించారు. సచిన్ రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అతి త్వరలోనే థియేటర్‌లలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: