తెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రధానంగా కథను బలంగా చేసుకొని, దర్శకత్వ నైపుణ్యంతో అత్యంత ప్రతిభావంతమైన సినిమాలను తెరకెక్కిస్తోంది. అలాగే పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. వీరిలో కొంతమంది ఏకంగా పాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటివారు అగ్ర కథానాయకులుగా చెలామణి అవుతున్నారు. అయితే వీరి తర్వాత తరంలో ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారు స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్నారు.ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోవడమేకాదు.. అక్కడున్న ఖాన్ త్రయాన్ని కూడా పూర్తిగా వెనక్కి నెట్టేశాడు. ప్రస్తుతానికి భారతదేశంలో నెంబర్ వన్ స్టార్ హీరో ఎవరంటే అందరూ ముక్తకంఠంతో చెపుతున్న పేరు డార్లింగ్ ప్రభాస్ అని. అలాగే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒకరు గ్లోబల్ హీరోగా, మరొకరు పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. పుష్ప2పై అంచనాలు భారీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.వీరితో సంబంధం లేకుండా ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రీమేక్ సినిమాలు కూడా ఇంతవరకు చేయలేదు. కేవలం తెలుగులో సినిమా చేస్తూనే పాన్ ఇండియా హీరోల స్థాయిలో అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా పారితోషికం కూడా అదేస్థాయిలో ఉంటుంది. సినిమా ఫ్లాపైన తనకున్న ఇమేజ్ తో దాదాపు దాన్ని నష్టాల బాట నుంచి బయటపడేస్తారు. ఇటీవలే విడుదలైన గుంటూరు కారం సినిమా ఫ్లాపైనప్పటికీ రూ.230 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మహేష్ బాబు స్టామినాను మరోసారి నిరూపించింది. రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాతో పాన్ వరల్డ్ హీరో అయిపోతున్నారు. ఏ హీరోకు ఆ హీరోకి ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ కేవలం తెలుగులోనే సినిమాలు చేస్తూ తెలుగు పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం, ఫ్యాన్ బేస్ చూసుకుంటే మహేష్ బాబుకు అగ్రస్థానం ఇవ్వొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నెంబర్ వన్ హీరో తమ హీరో అంటూ ఇతర హీరోల అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్న తరుణంలో వారంతా మహేష్ బాబును అంగీకరిస్తారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.