దేవర సెట్స్ నుంచి వీడియో లీక్..ఫ్యాన్స్ కు ఇంకా పూనకాలే...!!!

murali krishna
ఒకటి, రెండు కాదు ఏకంగా ఆర్నెళ్లు దేవర పోస్ట్ పోన్ అవడంతో తారక్ ఫ్యాన్స్ బాధ అంతా ఇంతా కాదు. అన్ని అనుకున్నట్లుగా కుదిరితే ఈ పాటికే దేవర సౌండ్ మార్మోగిపోయేది.ఎక్కడ చూసిన దేవర ప్రమోషన్ లే కనిపించేవి. ముందుగా ఏప్రిల్ 4న రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చిన మేకర్స్ దేవరకు సీక్వెల్ ప్లాన్ తీసుకురావడంతో కథలో పలు మార్పులు రావడం, దాంతో షూటింగ్ ఆలస్యం అవడం ఇలా పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. కాకపోతే నెలో, రెండు నెలలో పోస్ట్ పోన్ చేస్తారంటే ఏకంగా ఆర్నెళ్లు పోస్ట్ పోన్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా దసరా స్లాట్ ను బుక్ చేసుకుంది.ఈ దెబ్బతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ లో నుంచి కోలుకోవడానికి రెండు, మూడు రోజులు పట్టింది. మరీ ఆర్నెళ్లు ఎలా పోస్ట్ పోన్ చేస్తారంటూ.. మూవీ టీమ్ ను ట్యాగ్ చేస్తూ బాధను వెళ్లిబుచ్చుకున్నారు. కానీ చివరికి చేసేదేం లేదని లైట్ తీసుకున్నారు. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ధమ్ బిర్యానీ ప్యాకెట్ ల ఓ లీక్ ఆనందంతో సంబురాలు చేసుకునేలా చేస్తుంది. అదేంటంటే.. రీసెంట్ గా దేవర షూటింగ్ నుంచి ఓ క్లిప్ లీకయింది. అందులో ఎన్టీఆర్ వాటర్ లో అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్ ను షేక్ చేస్తుంది. కాగా ఈ వీడియోను తారక్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు.ఇక అప్పుడెప్పుడు రిలీజైన చిన్న గ్లింప్స్ కే టాలీవుడ్ తో పాటు అన్ని వుడ్ లు ఊగిపోయాయి. ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని తారక్ ఈ సినిమా స్టార్ట్ చేశాడు. మొదట సింగిల్ పార్ట్‌గానే తెరకెక్కించాలని ప్లాన్ చేసినా.. సినిమా కథ ఒక్క పార్ట్‌లో చెప్తే అసంపూర్ణంగా ఉంటుందని భావించి, రెండు పార్ట్‌లుగా కొరటాల ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఆచార్య వంటి భారీ డిజాస్టర్ తర్వాత.. కసితో కొరటాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఇండియన్‌ సినీ చరిత్రలో ఇప్పటివరకు మనం చూడని యాక్షన్ సీన్లను దేవర టీమ్ డిజైన్‌ చేస్తుందట. అండర్‌ వాటర్‌ సీన్‌ అయితే మరో అద్భుతమట. సిల్వర్ స్క్రీన్‌పై ఆ సన్నివేశం చూసినప్పుడు సీట్లలో ఒక్కరు కూడా కూర్చోరట. ఇలాంటి లీకులు నందమూరి అభిమానుల్లోనే కాదు సగటు ఆడియెన్స్‌లో సైతం అంతులేని అంచనాలు నెలకొల్పుతున్నాయి. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్‌కు జోడీగా జాన్వీకపూర్‌ నటిస్తుంది. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా కనిపించబోతున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: