మన టాలీవుడ్ హీరోల కొత్త రెమ్యునరేషన్ ఎంతో తెలుసా...??
మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలు చేయనప్పటికీ పారితోషికం అదే రేంజ్ లో ఉంటుంది. సినిమాకు రూ.80 నుంచి రూ.120 కోట్ల మధ్య తీసుకుంటారని తెలుస్తోంది. లాభాల్లో వాటాలు తీసుకోవడంలాంటివి చేయరు. అల్లు అర్జున్ పుష్ప2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తను కూడా సినిమాకు రూ.80 నుంచి రూ.120 కోట్ల మధ్య తీసుకుంటాడంటారు. రామ్ చరణ్ కూడా రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సినిమాకు రూ.100 నుంచి రూ.120 కోట్లు తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ పారితోషికం కూడా రూ.80 నుంచి రూ.100 కోట్ల వరకు ఉంది. దాదాపు ఈ హీరోలంతా తమ పారితోషికాన్ని రూ.100 కోట్లకు తక్కువగా మాత్రం తీసుకోవడంలేదని అర్థమవుతోంది. భవిష్యత్తులో ఎవరెంత ఛార్జి చేస్తారో చూడాలి మరి.
తెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రధానంగా కథను బలంగా చేసుకొని, దర్శకత్వ నైపుణ్యంతో అత్యంత ప్రతిభావంతమైన సినిమాలను తెరకెక్కిస్తోంది. అలాగే పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. వీరిలో కొంతమంది ఏకంగా పాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటివారు అగ్ర కథానాయకులుగా చెలామణి అవుతున్నారు. అయితే వీరి తర్వాత తరంలో ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారు స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్నారు.