టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న వారిలో హర్ష చీముడు ఒకరు . ఈయన తన కెరియర్ లో ఎన్నో సినిమా లలో మరియు వెబ్ సిరీస్ లలో నటించి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు . అలాగే ఎంతో మంది అభిమానులను కూడా ఈయన సంపాదించుకున్నాడు . చాలా సంవత్సరాల పాటు కమీడియన్ గా కెరియర్ ను కొనసాగించిన హర్ష కొంత కాలం క్రితం సుందరం మాస్టర్ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించాడు.
ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది . కాకపోతే ఈ సినిమాలో హర్ష మాత్రం తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు . ఈ మూవీ లోని ఈయన నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకు ల నుండి మంచి ప్రశంసలు దక్కాయి . ఇక పోతే థియేటర్ లలో ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.
తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది . ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ఆహా సంస్థ వారు దక్కించుకున్నారు . అందులో భాగంగా ఈ మూవీ ని మార్చి 28 వ తేదీ నుండి తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.