మహేశ్వరి బేబీ బంప్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..!!!
మొదటిగా ఈ ముద్దుగుమ్మ అన్నా చెల్లెలు అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయింది. అనంతరం పెళ్లినాటి ప్రమాణాలు, శశిరేఖ పరిణయం, అభిషేకం ఇలా దాదాపు 20 సీరియల్స్ లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ ముద్దుగుమ్మ తెలంగాణ యాసలో అట్లీస్ట్ ఒక సీరియల్ అయినా చేయాలనేదే ఈమె కోరిక అట. ఇక ఈ ముద్దుగుమ్మ పర్సనల్ విషయానికి వస్తే ఈమె శివనాగ్ అనే ఒక యువకుడిని ప్రేమించి పెళ్లాడింది. వీరిద్దరిదీ ఫేస్బుక్ ప్రేమాయణం. ప్రస్తుతం వీరిద్దరి దాంపత్య జీవితం ఎటువంటి కలహాలు లేకుండా సాఫీగా సాగుతుంది.ఇక వీరికి.. హరిణి అనే ఒక పాప కూడా జన్మించింది. తల్లితో పాటు కూతురు కూడా పలు యూట్యూబ్ వీడియోలలో కనిపిస్తూ సందడి చేస్తుంది. ఇక ఇటీవలే మహేశ్వరి తన రెండో ప్రెగ్నెన్సీ ని అనౌన్స్ చేసింది. దీంతో ఈమె ఫ్యాన్స్ చాలా ఖుషి గా ఫీల్ అయ్యారు కూడా. ఇక నిన్న హోలీ సందర్భంగా రంగురంగుల తో దర్శనమిచ్చింది మహేశ్వరి. తన కుటుంబంతో దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలలో మహేశ్వరి కి బేబీ బంప్ అసలు కనిపించలేదు. దీంతో ఒక్కొక్కరు తమ అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ” మొన్నటి వరకు ఉన్న బేబీ బంప్ ఇప్పుడు ఏమైంది? సడన్గా అలా ఎలా మిస్సయింది? మాకు ఏదో తేడా కొడుతుంది ” అంటూ కామెంట్స్ సైతం చేస్తున్నారు.