మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ మరో కొత్త రికార్డును నెలకొల్పింది. టాలీవుడ్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మలయాళం డబ్బింగ్ మూవీగా ఈ సినిమా నిలిచింది.అలాగే తమిళ్ లో కూడా ఈ సినిమా రికార్డ్ వసూళ్లు సాధిస్తుంది.ప్రేమలు సినిమా రిలీజ్‌కు ముందు టోవినో థామస్ 2018 మూవీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. గత సంవత్సరం థియేటర్లలో రిలీజైన ఈ డబ్బింగ్ మూవీ తెలుగులో కూడా 10.85 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది.2018 మూవీని తెలుగులో అల్లు అరవింద్‌తో కలిసి బన్నీవాస్ విడుదల చేశాడు. కోటి రూపాయల బ్రేక్ ఈవెన్‌తో రిలీజైన ఈ సినిమా నిర్మాతలకు పదింతల లాభాలను తెచ్చిపెట్టింది. తాజాగా 2018 రికార్డును ప్రేమలు సినిమా అధిగమించింది.ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్ మార్చి 8న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటిదాకా ఈ డబ్బింగ్ వెర్షన్ 15 కోట్ల దాకా కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఫస్ట్ డే కోటి రూపాయల లోపే వసూళ్లను ఈ మూవీ రాబట్టింది. సినిమాకి మౌత్ టాక్ బాగుండటంతో రోజురోజుకు వసూళ్లు పెరుగుతూ వచ్చాయి.
తాజాగా తెలుగులో మోహన్‌లాల్ ఇంకా మమ్ముట్టి లాంటి స్టార్ హీరోల సినిమాలకు సాధ్యం కానీ సెన్సేషనల్ రికార్డును కూడా సృష్టించింది. తెలుగులో డబ్ అయిన మలయాళం సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో టాప్ ప్లేస్‌లో ఈ సినిమా నిలిచింది. ఈ లిస్ట్‌లో దాదాపు పది కోట్ల కలెక్షన్స్‌తో మూడో స్థానంలో మోహన్‌లాల్ మన్యం పులి సినిమా ఉంది.ఇక ప్రేమలు సినిమాను తెలుగులో టాప్ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ విడుదల చేశాడు. ఈ సినిమాతోనే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. ఫస్ట్ మూవీతోనే పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ ని అందుకున్నాడు.ప్రేమలు మూవీలో నస్లేన్, మమతా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు గిరీష్ ఏడీ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీలో తన క్యూట్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది మమితా బైజు. ప్రేమలుతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా ఆమె మారిపోయింది. ప్రేమలు బ్లాక్‌బస్టర్ హిట్ తో మమితా బైజుకు తెలుగు, తమిళ భాషల నుంచి ఆఫర్లు క్యూ కడుతోన్నాయి.