సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్ - అదితి రావు హైదరీ..!!!
మరోవైపు సిద్ధార్థ్ గతేడాది చిన్నా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక సిద్ధార్థ్ ఇండియన్ 2 మూవీలోనూ నటించాడు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని శ్రీ రంగనాయకస్వామి ఆలయంలో సిద్ధార్థ్, అదితి రావు హైదరీ వివాహం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా తమిళనాడుకు చెందిన పురోహితులు ఈ వివాహ వేడుకలను నిర్వహించినట్లు టాక్ వినిపిస్తోంది.ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగిందని తెలుస్తోంది. అయితే వీరి పెళ్లికి సంబంధించిన వార్తలపై సిద్ధార్థ్ కానీ, అదితి రావు హైదరి కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఇకపోతే సిద్ధార్థ్, అదితి రావు హైదరి గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారు. 'మహా సముద్రం' సినిమా షూటింగ్ సమయంలో వీరి ప్రేమ చిగురించింది.
ఇక అప్పట్నుంచి ఈ లవ్ కపుల్ పలు ఈవెంట్స్, ఫంక్షన్స్, రెస్టారెంట్లలో కనిపించారు. ఇదిలా ఉంటే.. సిద్ధార్థ్‌కు ఇది రెండో వివాహం.. కాగా అదితి రావుకి కూడా ఇది రెండో పెళ్లి. సిద్ధార్థ్ 2003లో మేఘన అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు.కానీ అనివార్య కారణాల వల్ల విభేదాలు ఏర్పడి ఇద్దరూ 2007లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే అతడి బాగుబాగోగులు మొత్తం సిద్ధార్థే చూసుకుంటున్నాడు. అలాగే అదితికి కూడా ఇది రెండో మ్యారేజ్. గతంలో సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరి మధ్య కూడా విభేధాలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు.కాగా.. సిద్దార్థ్, అదితిరావు హైదరి.. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. 2003లో మేఘన ను సిద్ధార్థ్ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అనంతరం ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో.. విడిపోయారు. ఆ తర్వాత సిద్ధార్థ్ విషయంలో మళ్లీ పెళ్లి అంటూ ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. చివరకు అదితిరావు హైదరిని ఇలా రహస్యంగా వివాహం చేసుకుని.. మళ్లీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అదితి రావు కూడా 2002లో లాయర్, యాక్టర్ అయిన సత్యదీప్ మిశ్రా ను వివాహం చేసుకుని.. ఆ తర్వాత విడాకులు తీసుకుంది.