మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబి నేషన్లో ఓ సినిమా రాబో తున్న విషయం తెలిసిందే...ఈ మూవీకి సంబం ధించి ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది..ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్నాడు... ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దసరా కానుక గా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కి స్తున్నారు.. మొదటి భాగం అక్టోబర్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా సక్సెస్ ని బట్టి రెండో పార్ట్ మరింత భారీ స్థాయి లో ఉంటుంది.మరోవైపు ఎన్టీఆర్ సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నారు. ఎన్టీఆర్ 31గా ఈ మూవీ రాబోతుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్తో `సలార్ 2`మూవీ తెరకెక్కించబోతున్నారు.ఆ తరువాత తారక్ మూవీని ప్రారంభించబోతున్నారు. ఈ ఏడాది చివర్లోగానీ లేదంటే వచ్చే ఏడాది గానీ ఈ మూవీ స్టార్ట్ కానుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ముందే ఎన్టీఆర్ మూవీ ని స్టార్ట్ చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్టు మరో వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కానీ ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ త్వరలోనే సలార్ 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. దీంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ డిలే అవుతుందని తెలుస్తుంది.
అయితే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన మరో క్రేజీ, షాకింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాని కూడా దర్శ కుడు ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు.ఇటీ వల ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఎన్టీ ఆర్ సినిమా కూడా రెండు భాగాలు గా ఉంటుందని తెలిపారు. ఈ వార్త విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఖుషి గా వున్నారు.