మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..రీసెంట్ గా గామి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ డీసెంట్ హిట్ అందుకున్నాడు..గామి మూవీలో విశ్వక్ యాక్టింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. ప్రస్తుతం ఈ హిరో నుంచి వస్తున్న మరో లేటెస్ట్ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. మే 17 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..అయితే నేడు విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా తన తాజా ప్రాజెక్ట్‌లు వరుస అనౌన్స్మెంట్లు వస్తున్నాయి.ఇక విశ్వక్ నటిస్తున్న మరో క్రేజీ మూవీ VS12. ఈ మూవీని భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన షైన్ స్క్రీన్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది.తాజాగా ఈ మూవీ టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.ఈ మూవీకి 'లైలా' అనే టైటిల్ ని పెట్టారు. ఇక ఈ సినిమా లో తాను లేడీ గెటప్ లో కనిపించబోతున్నట్టు విశ్వక్సేన్ ప్రకటించాడు.
నూతన దర్శకుడు రామ్ నారాయణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు... ఆకాంక్ష శర్మ ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించబోతుందని సమాచారం.తనిష్క్ బాగ్చి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ ఈ మూవీకి సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నారు.ఇదిలా ఉంటే విశ్వక్సేన్ మరోవైపు రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్న “VS 10” లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. హై ఫోర్స్ ఇంజిన్ త్వరలోనే షురూ అవుతుంది.. ఫన్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి.. అంటూ మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు.ఈ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.ఇలా విశ్వక్ సేన్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.