అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. అలాగే ఈ
మూవీ కి సంబంధించిన రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ
మూవీ ట్రైలర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక నిన్న రాత్రి ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్
ఈవెంట్ ను కూడా భారీగా నిర్వహించింది. ఇందులో భాగంగా
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ... నేను
హీరో గా
పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన గీత గోవిందం
సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఆ
సినిమా తర్వాత నేను ఎంతో కష్టపడి కొన్ని సినిమాల్లో నటించాను.
అవి అద్భుతమైన విజయాలను అందుకుంటాయి అని అనుకున్నాను. కాకపోతే ఇప్పటివ్వరకు నా కెరియర్ లో గీత గోవిందం స్థాయి విజయం దక్కలేదు అని చెప్పుకొచ్చాడు. ఇలా ఉంటే
విజయ్ ...
పరుశురామ్ కాంబోలో రూపొందిన
సినిమా కావడంతో ఈ
మూవీ కి ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 43 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ
సినిమా ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.