తమిళ్ స్టార్ హీరో శివకార్తీకేయన్ కు తెలుగులో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.విభిన్నమైన కథలు ఎంచుకంటూ ఎప్పుడూ సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. తాజాగా శివ కార్తికేయన్ నటించిన మూవీ “అయలాన్”.. ఈసారి ఈ హీరో ఓ ఏలియన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'అయలాన్' ఈ సంక్రాంతికి తమిళ్ వెర్షన్ థియేటర్లో విడుదలైంది.తెలుగు వెర్షన్ కూడా అదే సమయంలో రిలీజ్ కావాల్సి ఉండగా సంక్రాంతికి టాలీవుడ్ నుంచి భారీ సినిమాలు సిద్ధంగా ఉండటంతో అయాలాన్ మూవీ వెనక్కి తగ్గింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్న కూడా కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. అప్పటి నుంచి అయలాన్ తెలుగు వెర్షన్ కి వరుస అటంకాలు వస్తూనే ఉన్నాయి.
థియేటర్స్ లో రిలీజ్ కాకపోయిన కనీసం ఓటీటీలో అయిన వస్తుందనుకుంటే ఈ మూవీ తెలుగు వెర్షన్ కంటే ముందు తమిళ్ వెర్షన్ ను స్ట్రీమ్ చేశారు. దీంతో శివకార్తికేయన్ తెలుగు అభిమానులు కాస్త హర్ట్ అయ్యారు. ఎప్పుడో ఫిబ్రవరి 19న 'అయలాన్' తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వస్తుందని బాగా ప్రచారం జరిగింది. కానీ అందరికి షాకిస్తూ కేవలం తమిళ భాషలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యింది. దీంతో ఈ మూవీ తెలుగు వెర్షన్ కోసం ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.త్వరలోనే 'అయలాన్' తెలుగు వెర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేస్తుందంటూ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 19 నుంచి అయలాన్ తెలుగు వెర్షన్ సన్ నెక్ట్స్ స్ట్రీమింగ్ కానుందటూ ప్రచారం జరుగుతుంది. అయితే, ఇది ఇంకా ఆఫీషియల్ న్యూస్ అయితే కాదు. దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.