తమన్నా అందానికి సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఈ ముద్దుగుమ్మ ను ఆమె అభిమానులందరూ ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుస్తూ ఉంటారు. తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ హిందీ వంటి భాషల్లో కూడా వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపుని సంపాదించుకుంది ఈ సుందరి. సినీ ఇండస్ట్రీకి వచ్చే ఇప్పటికే 17 సంవత్సరాలు దాటిపోయినప్పటి కీ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ల లిస్టులో దూసుకుపోతోంది. తెలుగులో చివరగా భోళా శంకర్ సినిమాలో మెరిసింది ఈ బ్యూటీ. అయితే ఇప్పుడు తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైన పెట్టిందని చెప్పొచ్చు.

 ప్రస్తుతం తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా సినిమాలు వెబ్ సిరీస్ చేస్తున్న ఈమె ఇదివరకు సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు వరుసగా వెబ్ సిరీస్ చేస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం లాస్ట్ స్టోరీస్ టు అనే వెబ్ సిరీస్ తో తన ప్రియుడితో కలిసి ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చింది.  తాజాగా తమిళంలో తమన్నా నటించిన చిత్రం అరణ్మణై -4. డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ లో రాశీ ఖన్నా, యోగిబాబు, కోవై సరళ, వి. టీవీ గణేశ్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన అరణ్మణై 1, 2, 3 చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఇప్పుడు తమన్నా నటిస్తున్న అరణ్మణై 4 పై భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది.  ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తమన్నా వయసు 35 ఏళ్లు. ఇప్పటికీ తరగని అందం.. ఫిట్నేస్ ఆశ్చర్యపరుస్తుంటుంది. తాజాగా తన డైలీ రోటిన్ డైట్, ఫిట్నెస్ సీక్రెట్ గురించి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. లతో ఎంత బిజీగా ఉన్న ఉదయం యోగా, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, కార్డియో లాంటివి కనీసం గంటసేపైనా చేస్తానని.. ఉదయం నానబెట్టిన బాదంపప్పులతో తన డైట్ స్టార్ట్ అవుతుందని తెలిపింది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహరంతోపాటు.. బ్రౌన్ రైస్, పప్పు, ఉడికించిన కూరగాయముక్కలు, కూరలు తీసుకుంటానని.. అలాగే జ్యూస్ ఎక్కువగా తాగుతానని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: