మరోసారి రిపీట్ అవుతున్న బ్లాక్ బస్టర్ కాంబో..పోస్టర్ వైరల్..!!

murali krishna
 నేడు (ఏప్రిల్ 8)ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  పుట్టినరోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి వరుస అప్డేట్స్ వస్తున్నాయి.. ఈరోజు ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2' టీజర్ విడుదలై ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా అల్లుఅర్జున్ మరో మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమాకు సంబంధించి నయా అప్డేట్ వైరల్ అవుతుంది.టాలీవుడ్ లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో 'జులాయి','సన్నాఫ్ సత్యమూర్తి', 'అలా వైకుంటపురంలో'.వంటి  మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.ముఖ్యంగా 'అలా వైకుంఠపురంలో' ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.దీనితో మళ్లీ నాలుగో సారి వీరి కాంబినేషన్ కుదిరింది. 


ఇదే విషయాన్ని మేకర్స్ కొన్ని నెలల క్రితమే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే... అయితే ఎట్టకేలకు సోమవారం బన్నీ బర్త్ డే సందర్భంగా మూవీ టీం ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యూ అప్డేట్ ఇచ్చింది.నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రొడక్షన్ నెంబర్ 8 పేరుతో  పోస్టర్ రిలీజ్ చేస్తూ అల్లు అర్జున్ కి బర్త్డే విషెస్ ను తెలిపారు." అన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ పై ఏదైనా సాధించాలని గొప్ప పట్టుదల అంకితభావం ఉన్న అద్భుతమైన నటుడు భారతీయ సినిమా స్టైలిష్ ఐకాన్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత మా అల్లు అర్జున్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీతో మళ్ళీ పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా సార్" అంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: