సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులు పొలిటికల్లోకి ఎంట్రీ ఇస్తుండడం అనేది మన దేశవ్యాప్తంగా చాలా కాలం నుండి జరుగుతూనే వస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుండి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంతమంది సక్సెస్ కాగా... చాలా శాతం మంది ఫెయిల్యూర్ నే చూశారు. ఇక నా బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది నటులు కూడా ఈ మధ్యకాలంలో పొలిటికల్ ఎంట్రీలు ఇస్తున్నారు. అందులో కొంతమంది సక్సెస్ కూడా అయ్యారు.
హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సంజయ్ దత్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఈ మధ్యకాలంలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వార్తలు అటు తిరిగి ఇటు తిరిగి ఆయన దగ్గరకు చేరాయి. తాజాగా సంజయ్ దత్ ఈ వార్తలపై స్పందించాడు. నేను ఏ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం లేదు. నేను రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తాను అని అనేక వార్తలు బయట స్ప్రెడ్ అవుతున్నాయి.
ఆ వార్తలు అన్ని అవాస్తవం. నేను ఇప్పటివరకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలి అని అనుకోలేదు. ఒక వేళ నేను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నట్లు అయితే ముందుగా మీడియాకు చెపుతాను అని సంజయ్ దత్ తాజాగా తన పొలిటికల్ ఎంట్రీ పై వస్తున్న వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం సంజయ్ కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాకుండా అనేక టాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ వస్తున్నాడు.
అందులో భాగంగా కొంతకాలం క్రితమే "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ లో విలన్ పాత్రలో నటించి సౌత్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈయన ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో పొందుతున్న రాజా సాబ్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.