తెలుగు,
తమిళ పరిశ్రమలలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటీమణులు అయినటువంటి
తమన్నా ,
రాశి కన్నా ప్రస్తుతం "అరుణ్మనై 4" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు
కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి
సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే "అరుణ్మనై" సిరీస్ లో భాగంగా వచ్చిన 3
మూవీ లు వచ్చాయి.
అవి
కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. ఈ సిరీస్ లోని
మూవీ లు తెలుగు లో వేరు వేరు పేర్లతో విడుదల అయ్యాయి. ఇది ఇలా ఉంటే "అరుణ్మనై 4"
సినిమా కూడా తెలుగు లో విడుదల కానుంది. ఈ
సినిమా తెలుగు లో "బాక్" అనే పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ
సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల
థియేటర్ హక్కులను ఏషియన్
సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది.
ఈ విషయాన్ని కూడా ఈ
మూవీ యూనిట్ ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాలోని
తమన్నా ,
రాశి ఖన్నా క్యారెక్టర్
పోస్టర్ లను కూడా విడుదల చేశారు. ఈ
మూవీ లో
తమన్నా ...
శివాని పాత్రలో కనిపించనుండగా
రాశి కన్నా ...
మాయ పాత్రలో కనిపించబోతుంది.
ఇకపోతే
రాశి కన్నా ఇప్పటికే "అరుణ్మనై 3" లో
హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు. ఈ
మూవీ లోని మొదటి సాంగ్ అయినటువంటి "అచచో" అంటే సాగే పాటను ఏప్రిల్ 14 వ తేదీన ఆదివారం రోజు విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను విడుదల చేసింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.