చిన్నప్పటి నుండి అవంటే నాకిష్టం అంటున్న మెగా కోడలు...!!
ఆ పోస్టులో ఆమె ఈ విధంగా రాసుకొచ్చింది. నాకు అమ్మ చెవి దిద్దులు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇకపై అవి నావే అని తన పోస్ట్ లో రాసుకొచ్చింది. వాటిని ధరించి చీరలో కొన్ని ఫొటోలకు పోజు లిచ్చింది.ప్రస్తుతం ఇవి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టు వైరల్ అవ్వడం తో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా మొదటి లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమా తో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా తో భారీ గా పాపులారిటీ ని ఏర్పరచుకున్న లావణ్య ఆ తర్వాత తెలుగు లో పలు సినిమా లలో నటించి మెప్పించింది. తెలుగు లో రామ్ పోతినేని, వరుణ్ తేజ్,కార్తికేయ, ఇలాంటి హీరో ల సరసన నటించి మెప్పించింది. అయితే పెళ్లి అయిన కూడా సినిమా లలో నటిస్తాను. మంచి మంచి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను అని చెప్పు కొచ్చింది లావణ్య త్రిపాఠి.