కోలీవుడ్ నటుడు విశాల్ తాజాగా రత్నం అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా ... హరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని ఈ నెల 26 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. దానితో ప్రస్తుతం ఈ సినిమాలో హీరో అయినటువంటి విశాల్ అతు తమిళనాడు లోను ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రచారాలను జోరుగా కొనసాగిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో విశాల్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.
ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన తన పాత స్నేహితురాలు అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విశాల్ మాట్లాడుతూ ... ప్రస్తుతం తమిళ , తెలుగు పరిశ్రమలలో అద్భుతమైన అవకాశాలను దక్కించుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్ నాకు చిన్ననాటి స్నేహితురాలు. ఇండస్ట్రీ లో చాలా మంది కి టాలెంట్ ఉంటుంది. కానీ టాలెంట్ ఉన్న కొంత మంది కి మాత్రమే అవకాశాలు దక్కుతాయి. అలా టాలెంట్ ఉన్న నటిమనులలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. అందుకే ఆమెకు మంచి సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.
ప్రస్తుతం వరలక్ష్మి కి తమిళ్ కంటే కూడా తెలుగు లోనే చాలా సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. తెలుగులో ఆమెకు ఇంత మంచి గుర్తింపు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మేము రెగ్యులర్ గా టచ్ లో లేకపోయినా వీలు దొరికినప్పుడల్లా మెసేజ్ లు చేసుకుంటూ ఉంటాం అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి చెప్పుకొచ్చాడు.