గొప్ప మనసు చాటుకున్న స్టార్ హీరో సూర్య...!!
కొడుకు పేరు దేవ్ కాగా కూతురు పేరు దియా అనే సంగతి తెలిసిందే. సూర్య, జ్యోతిక కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని త్వరలో ఈ సినిమా కు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. సూర్య కెరీర్ విషయానికి వస్తే కంగువ సినిమాతో ఈ హీరో బిజీగా ఉండగా ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు.బింబిసార తరహా కాన్సెప్ట్ తో కంగువ తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. కంగువ దసరా టార్గెట్ గా రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండగా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. సూర్య కెరీర్ పరంగా కూడా భారీ విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో కంగువ మూవీ తెరకెక్కుతుండగా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు.