నందమూరి నటసింహం
బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ
సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ
మూవీ కి ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ
మూవీ బాలకృష్ణ కెరియర్ లో 109 వ సినిమాగా రూపొందుతూ ఉండడంతో ఈ
మూవీ ని "ఎన్ బి కె 109" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తూ వస్తుంది.
కొన్ని రోజుల క్రితం ఈ
సినిమా నుండి ఒక వీడియోను విడుదల ఈ
మూవీ యూనిట్ చేయగా అది అద్భుతమైన రేంజ్ లో ఉండడం, అందులో
బాలయ్య తన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ వీడియో తోనే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే గత కొంత కాలంగా ఈ సినిమాలో
బాలీవుడ్ నటుడు అయినటువంటి బాబి డియోల్ ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇకపోతే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తాజాగా ఈ
మూవీ దర్శకుడు బాబి అలాగే ఈ సినిమాను నిర్మిస్తున్న
సూర్య దేవర
నాగ వంశీ , బాబి డియోల్ ముగ్గురు కలిసి ఉన్న ఒక ఫోటోను ఈ చిత్ర బృందం వారు బయటకు వదిలారు. దీనితో ఈ
మూవీ లో
బాబీ డియోల్ నటిస్తున్నట్లు తెలిసిపోయింది. మరి ఈయన ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడా..? లేక మరేదైనా ఇతర పాత్రలో నటిస్తున్నాడా అనేది తెలియాలి అంటే.చిత్ర బృందం క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఈ
మూవీ లో
బాలయ్య సరసన ఇద్దరూ బ్యూటీలు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా
ఊర్వశి రౌటేలా ను ఇప్పటికే ఇందులో ఒక
హీరోయిన్ గా కన్ఫామ్ అయినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఇంకో
హీరోయిన్ గా ఎవరిని ఈ
మూవీ యూనిట్ సెలెక్ట్ చేస్తుందో చూడాలి. ఈ
మూవీ ని
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై
సూర్య దేవర
నాగ వంశీ నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్
తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.