సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజిని , శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను అందుకొని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు . ఈ సినిమా తర్వాత పలు మూవీ లలో రజిని నటించినప్పటికీ ఆ మూవీ లు ఏవి కూడా భారీ విజయాన్ని అందుకోలేదు . అలా చాలా సంవత్సరాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజాయలను ఎదుర్కొన్న రజిని పోయిన సంవత్సరం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో రూపొందిన జైలర్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.
ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అప్పటి వరకు ఏ తమిళ సినిమా కలెక్ట్ చేయని కలెక్షన్ లను వసూలు చేసి కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ప్రస్తుతం రజిని , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను విడుదల చేస్తూ ఈ మూవీ యూనిట్ ఓ వీడియోను విడుదల చేయగా దానికి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది.
ఇకపోతే ఈ మూవీ లో శృతి హాసన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా కోసం రజనీ తీసుకోబోతున్న రెమ్యూనిరేషన్ కు సంబంధించిన వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ కి రజిని 260 నుండి 280 కోట్ల మధ్యలో పారితోషకం తీసుకుంటున్నట్లు ఇది ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనిరేషన్ అని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.