తమ్ముడు ఖర్చుకు షాక్ లో ఇండస్ట్రీ వర్గాలు !

Seetha Sailaja
హీరో నితిన్ కు ఇప్పుడు ఉన్న పోటీ వాతావరణంలో నిలదొక్కుకోవాలి అంటే ఒక మంచి హిట్ కావాలి. గత కొంత కాలంగా వరస ఫ్లాప్ లతో సత్యమతమైపోతున్న నితిన్ ను అదేవిదంగా దర్శకుడు వేణు శ్రీరామ్ ను నమ్మి నిర్మాత ‘తమ్ముడు’ సినిమా పై పెడుతున్న ఖర్చును చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన నితిన్ పవన్ సినిమా టైటిల్ ను తన సినిమా టైటిల్ గా పెట్టుకుని ఈసారి గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా కోసం వేసిన ఒక భారీ సెట్ కు 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ప్రస్తుతం నితిన్ కు ఉన్న మార్కెట్ రీత్యా ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టడం సాహసం అని అంటున్నారు.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో కలెక్టర్ పాత్రలో నటిస్తున్న తన అక్క లయ ను కాపాడుకోవడం కోసం చేసే భారీ ఫైట్ ఈ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సెట్ లో చిత్రీకరిస్తున్నట్లు టాక్. గతంలో తమ్ముడు సెంటిమెంట్ తో వచ్చిన అనేక సినిమాలు హిట్ అయిన పరిస్థితులలో ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని వేణు శ్రీరామ్ ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది.

ఈసినిమా షూటింగ్ కొనసాగుతూ ఉండగానే నితిన్ తనకు ‘భీష్మ’ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ మూవీలో నటిస్తున్నాడు. ఈమూవీ పై కూడ భారీ బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు. ఈరెండు సినిమాలలో ఏఒక్క సినిమా హిట్ అవ్వకపోయినా నితిన్ కెరియర్ మరింత సమస్యలలో పడే ఆస్కారం ఉంది. మీడియం రేంజ్ హీరోల మధ్య పోటీ విపరీతంగా పెరిగిన పరిస్థితులలో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే ఎంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోకి అయినా వరస ఫ్లాప్ లు అతడి కెరియర్ ను ప్రభావితం చేస్తాయి..  




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: