పుష్ప 2 కు ఎదురీత ?
వాస్తవానికి ఆ ప్రోమో వీడియోలో ‘పుష్ప పుష్ప’ అంటూ కోరస్ లో సింగర్ లు పాడిన పాట బీట్ కేవలం 20 సేకన్స్ మాత్రమే ఉన్నప్పటికీ ఆ ప్రోమో వీడియో ‘పుష్ప 2’ పై అంచనాలను తారుమారు చేస్తూ ఆ ప్రోమో వీడియో పై విపరీతంగా ట్రోలింగ్ జరగడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. వాస్తవానికి ఈపాటకు సంబంధించిన టోటల్ లిరిక్ ను మే 1వ తేదీన విడుదల చేయబోతున్నారు.
అయితే ఈమూవీ పాటల పై మరింత మ్యానియా పెంచడానికి వ్యూహాత్మకంగా విడుదలచేసిన ఈటైటిల్ సాంగ్ ప్రోమో కు విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ‘పుష్ప 2’ మూవీని తెలుగు రాష్ట్రాలలో అత్యధిక రేట్లకు అమ్మాలని ఈమూవీ మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆప్రయత్నాలలో భాగంగానే ఆగష్టులో విడుదల అవుతున్న ‘పుష్ప 2’ నిర్మాతలు ఈమూవీని కొనాలని ఆశక్తి కనపరుస్తున్న బయ్యర్లకు అత్యంత భారీ రేట్లు కోట్ చేస్తున్నట్లు టాక్.
ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీ టైటిల్ సాంగ్ ప్రమోకు వచ్చిన స్పందన ఈమూవీ నిర్మాతలను ఈమూవీని కొనాలని భావిస్తున్న బయ్యర్లను ఎంతోకొంత వెనకడుగు వేసేలా చేస్తుందా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి. అయితే ఈ ప్రోమో సాంగ్ బిట్ కు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ వెనుక టాప్ హీరోల అభిమానులు కొందరు ఉన్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి..