ఈ వారం "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన క్రేజీ తెలుగు మూవీలు ఇవే..!

MADDIBOINA AJAY KUMAR
ఈ వారం "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు మూవీ లు ఏవో తెలుసుకుందాం.

బీమా : గోపీచంద్ హీరోగా మాళవిక శర్మ , ప్రియ భవాని శంకర్ హీరోయిన్ లుగా హర్ష దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే తాజాగా ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

టిల్లు స్క్వేర్ : సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 29 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని 100 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" లో స్ట్రీమింగ్ అవుతుంది.

ది ఫ్యామిలీ స్టార్ : విజయ్ దేవరకొండ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ పేట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఏప్రిల్ 5 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. తాజాగా ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను అమెజాన్ సంస్థ వారు తమ "ఓ టి టి" లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ott

సంబంధిత వార్తలు: