సత్యదేవ్ "కృష్ణమ్మ" మూవీ డిజిటల్ పార్ట్నర్ లాక్..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడు అయినటువంటి సత్య దేవ్ తాజాగా కృష్ణమ్మ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మొదట ఈ చిత్ర బృందం మే 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాను మే 3 వ తేదీన కాకుండా మే 10క్వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క డిజిటల్ పార్టనర్ ను లాక్ చేసుకుంది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను మే 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్టర్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క లోగోను కూడా వేసింది. దానితోనే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు అర్థం అవుతుంది. ఇకపోతే గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి భైరవ సంగీతం అందించగా ... మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ వారు మరియు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ మూవీ ని రిలీజ్ చేయనున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం విడుదలకి రాబోతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రస్తుతం తెలుగు జనాల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: