"మహేష్" బ్లాక్ బాస్టర్ "పోకిరి" కి నేటితో 18 ఏళ్లు..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో అదిరిపోయే సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. అలా మహేష్ నటించిన అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో పోకిరి సినిమా ఒకటి. ఈ మూవీ 2006 వ సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల అయింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించడం , ఆ సమయం లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి పూరి జగన్నాథ్ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో కే బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్ లను రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తో ఇటు మహేష్ , అటూ పూరి జగన్నాథ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఈ మూవీ లో గోవా బ్యూటీ ఇలియానా , మహేష్ కి జోడిగా నటించగా , ప్రకాష్ రాజ్ ఇందులో విలన్ పాత్రలో నటించాడు. నాజర్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... మెలోడీ బ్రహ్మ మని శర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఈయన ఈ సినిమాకు అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇక ఈ మూవీ లోని మహేష్ డైలాగ్ డెలివరీ కి , డ్రెస్సింగ్ స్టైల్ కి ఆ సమయంలో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇకపోతే2006 వ సంవత్సరం విడుదల అయ్యి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరి సినిమా విడుదల అయ్యి నేటితో 18 ఏళ్లు పూర్తి అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 18 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి కూడా ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు మంచి "టి ఆర్" పి రేటింగ్ ను తెచ్చుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: