మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే మూవీ తో సూపర్ సక్సెస్ నీ అందుకొని గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... కియార అద్వానీ ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించబోతోంది.
నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అంజలి , సునీల్ , శ్రీకాంత్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతుంది. ఇందులో రెండు విభిన్నమైన పాత్రలలో చరణ్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఒక పాత్రలో చరణ్ తండ్రి గాను , మరొక పాత్రలో కొడుకు గానూ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో ఈ సినిమా నిర్మాత దిల్ రాజు , ఈ మూవీ హీరో రామ్ చరణ్ ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు.
కానీ ఇందుకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటివరకు రాలేదు. ఇక శంకర్ ఇప్పటికే "ఇండియన్ 2" మూవీ కి సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేశాడు. ఈ మూవీ జూన్ ల విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. కాకపోతే పక్కాగా ఏ తేదీన అనేది మాత్రం అప్డేట్ ఇవ్వలేదు. దానితో "ఇండియన్ 2" మూవీ విడుదల తేదీ కన్ఫామ్ అయిన తర్వాత గేమ్ చేంజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. దానితో "ఇండియన్ 2" మూవీ విడుదల తేరి కన్ఫార్మ్ అయ్యే వరకు గేమ్ చేంజర్ విడుదలపై ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం లేదు అని తెలుస్తుంది.