తెలుగు,
తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్
హీరోయిన్ గా బాగా రాణించింది సమంత. ఎంతమంది కొత్త
హీరోయిన్స్ వస్తున్నా
సామ్ కు ఉన్న క్రేజ్ మాత్రం మార లేదు. ఈ రోజు
సమంత పుట్టిన రోజు.సోషల్
మీడియా వేదికగా
సమంత అభిమానులు ఆమె ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. ఆమెకు విషెస్ తెలుపుతూ..ఆమె ఫోటోలను షేర్ చేస్తున్నారు. సినీ సెలబ్రెటీలు కూడా సమంతకు విషెస్ తెలుపుతున్నారు.
సమంత చాలా తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. దాదాపు అందరి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తెలుగుతో పాటు
తమిళ్ లోనూ
సినిమాలు చేసింది సామ్. ఇంకా అలాగే యంగ్
హీరో నాగ చైతన్యను
పెళ్లి చేసుకుంది. అయితే ఆ తర్వాత ఊహించని విధంగా విడిపోయి ఈ ఇద్దరూ షాక్ ఇచ్చారు.ఇక విడిపోయిన తర్వాత కూడా
సామ్ సినిమాలతో బిజీగా మారిపోయింది. అలాగే మాయోసైటిస్ వ్యాధి బారిన పడింది సామ్. దాంతో సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చింది సమంత. ప్రస్తుతం ఆమె మాయోసైటిస్ నుంచి కోలుకుంటుంది.
అలాగే
సామ్ స్టార్
హీరోయిన్ గా భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుంటుంది . అయితే
సామ్ మొదటి సాలరీ ఎంతో తెలుసా.?
సామ్ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఖచ్చితంగా చాలా షాక్ అవుతారు.ఇక
సమంత కాలేజీ చదువుతున్న సమయంలో కేవలం తన పాకెట్ మనీ కోసం మోడలింగ్ రంగం వైపు అడుగు వేసింది సమంత. అయితే
సామ్ సెకండరీ
స్కూల్ చదివే సమయంలో ఓ
ఈవెంట్ లో గెస్ట్ లను
వేదిక పైకి పిలిచేందుకు వెళ్లిందట. ఆ పని చేసినందుకు గాను సమంతకు అప్పుడు రూ. 500 ఇచ్చారట. ఇదే తన తొలి రెమ్యునరేషన్ అని
సమంత పలు సందర్భాల్లో తెలిపింది . ఇప్పుడు
సమంత రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఒకొక్క సినిమాకు ఆమె కోట్ల రూపాయల్లో రెమ్యునరేషన్ తీసుకుంటుంది. తెలుగు,
తమిళ్ తో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తుంది సమంత.
సమంత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు,
సినిమా అప్డేట్ లని అభిమానులతో షేర్ చేసుకుంటుంది సమంత. అలాగే ట్రోల్స్ కి కూడా తనదైన స్టైల్ లో కౌంటర్స్ వేస్తుంది.