జాతి రత్నాలు సీక్వల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ఫరియా..!?

Anilkumar
టాలీవుడ్ బ్యూటీ పొడుగు కాళ్ళ సుందరిగా పేరు తెచ్చుకున్న ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన యాక్టింగ్ తో ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజీ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. అయితే అందరికీ గుర్తు రాకపోవచ్చు కానీ జాతి రత్నాలు చిట్టి అని చెప్పిన వెంటనే అందరికీ గుర్తుకు వచ్చేస్తోంది.  ఈ సుందరి జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.  ఇక ఈ సినిమాలో చిట్టి పాత్రలో తన అద్భుతమైన నటనతో ఆడి పాడింది ఈమె.  దీంతో ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోయిన్ల రేంజ్ లో క్రేజ్ పెరిగిపోయింది.

ఇక జాతి రత్నాలు సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ కి వరుస సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అలా స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. దీంతో ఇప్పుడు మరో సినిమాతో అలరించడానికి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన సినిమా ఆ ఒక్కటి అడక్కు. అయితే ఈ సినిమాలో కామెడీ స్టార్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్నారు.

 కాగా ఈ సినిమా మే 3 న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ ఒక్కటి అడక్కు సినిమాతోపాటు జాతి రత్నాలు 2 మూవీపై అప్డేట్ ఇచ్చింది చిట్టి. దీంతో ఫరియా అబ్దుల్లా కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “ఆ ఒక్కటి అడక్కు” సినిమాలో సిద్ది అనే పాత్రలో నటిస్తున్నట్లు ఆమె తెలిపింది.ఈ చిత్ర కథ పెళ్లి అనే అంశం చుట్టూ తిరుగుతూ ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.ప్రస్తుతం “జాతి రత్నాలు” మూవీ నిర్మాతలు “కల్కి 2898 ఏడి ” సినిమాతో బిజీగా ఉన్నారు. అది చాలా పెద్ద సినిమా అని దాని కోసం తాను ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపింది. కల్కి విడుదల తర్వాత జాతిరత్నాలు 2 మూవీ చేసే అవకాశం ఉన్నట్లు ఫరియా అబ్దుల్లా తెలిపింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: