సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమాలలో
పోకిరి మూవీ ఒకటి.
గోవా బ్యూటీ
ఇలియానా ఈ సినిమాలో
హీరోయిన్ గా నటించగా ...
పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
మణిశర్మ సంగీతం అందించిన ఈ
మూవీ లో ప్రకాష్ రాజు విలన్ పాత్రలో నటించగా ... నాజర్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. 2006 వ సంవత్సరం విడుదల అయిన ఈ
సినిమా అప్పటి వరకు ఏ తెలుగు
సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్ లను వసూలు చేసి
టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఇంతటి విజయం సాధించిన ఈ
సినిమా నేటితో 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. దానితో అనేక మంది ఈ
సినిమా గురించి సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇక తాజాగా తెలుగు యువ హీరోలలో ఒకరు అయినటువంటి
ఆనంద్ దేవరకొండ కూడా
పోకిరి మూవీ గురించి తన సోషల్
మీడియా అకౌంట్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా
ఆనంద్ దేవరకొండ "పోకిరి"
మూవీ గురించి స్పందిస్తూ ...
స్కూల్ కారిడార్‌లలో చిన్నప్పుడు ఈ రన్నింగ్ స్టైల్ ని అనుకరించడానికి ప్రయత్నించడం నాకు ఇంకా కూడా గుర్తుంది.
చాలా మంది ఇతర పిల్లల్లాగే , నేను కూడా చేశాను అంటూ మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ పిక్ పై
ఆనంద్ దేవరకొండ కామెంట్స్ చేసారు. ది అతని దృష్టిలో ఉన్న తీవ్రత , అణచివేయబడిన కోపం ఈ శైలిని ఐకానిక్‌గా మార్చింది అని కొనియాడారు. నిజంగా ఒక
మాస్టర్ పీస్
సినిమా పోకిరి అంటూ
ఆనంద్ చెప్పుకొచ్చారు. దిల్ సుఖ్ నగర్ లోని మేఘా ధియేటర్ లో ఈ చిత్రం ను చూసినట్లు
ఆనంద్ పేర్కొన్నారు. ఇక తాజాగా
పోకిరి మూవీ గురించి స్పందిస్తూ
ఆనంద్ చేసిన ఈ ట్వీట్ సోషల్
మీడియా లో ఇప్పుడు వైరల్ గా మారింది.