ప్రసన్న వదనం.. ఇలాంటి సినిమా ఇండియాలోనే రాలేదు?
ఈ సినిమా గురించి నిర్మాత జెఎస్ మణికంఠ ఇంకా ఏమన్నారంటే..
కలర్ ఫోటో, ఫ్యామిలీ డ్రామా చిత్రాలకు సహా నిర్మాతగా చేశాను. ఓ స్నేహితుడి ద్వారా ప్రసన్న వదనం కథ నా దగ్గరకి వచ్చింది. ఈ చిత్ర దర్శకుడు అర్జున్, సుకుమార్ గారి దగ్గర పని చేశారు. అర్జున్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. సుహాస్ కి వినిపిస్తే ఆయనకి కూడా నచ్చింది. అలా ప్రాజెక్ట్ మొదలైయింది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా సినిమా చేశాం. నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. బిజినెస్ పరంగా లాభాల్లో వున్నాం. మైత్రీ, హోంబలే లాంటి పెద్ద సంస్థలు ఈ సినిమాని విడుదల చేయడం ఆనందంగా వుంది.
అర్జున్ చెప్పిన కథ చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. సుహాస్ కి యూనిక్ కాన్సెప్ట్స్, కథలు భలే నప్పుతాయి. ఈ సినిమా ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ తో వస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఇండియన్ సినిమాలో ఇప్పటికీ రాలేదు. ఇది అన్నీ వర్గాల ప్రేక్షకులని అలరించేలా వుంది. చివరి వరకూ సర్ ప్రైజ్ అయ్యే కంటెంట్ వుంది.
దర్శకుడు అర్జున్ అద్భుతమైన వర్క్ చేశాడు. కథని చాలా పగడ్బందీగా రాశారు. దాని కోసం చాలా కసరత్తులు చేశాడు. మాకు ఎలాంటి ఎమోషన్ చెప్పాడో అదే ఎమోషన్ ని తెరపైకి తీసుకొచ్చాడు. తను చాలా ప్లెక్స్ బుల్ గా వుంటారు. సుకుమార్ గారి దగ్గర పని చేశాననే గర్వం ఆయనకీ వుండదు. అందరి సలహాలు వింటాడు. సినిమాకి ఏది మంచిదో అది తీసుకుంటారు. ఒక నిర్మాతగా తనకి కావాల్సిన క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చాం. సినిమాని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. తను భవిష్యత్ లో చాలా పెద్ద దర్శకుడౌతాడు.
ఇక హీరో సుహాస్ తెలుగు పరిశ్రమకి అదృష్టం. ఇప్పుడు చాలా మంది దర్శకులు సుహాస్ ని దృష్టిలో పెట్టుకొని కథలు రాస్తున్నారు. తనపై కొత్తకథలు వర్క్ అవుట్ అవుతున్నాయి. తను చాలా క్రమశిక్షణ గల నటుడు. నిర్మాతలకు, దర్శకులకు కంఫర్ట్బుల్ గా ఉంటాడు. తనతో వర్క్ చేయడం చాలా మంచి అనుభవం.