దీపక్ సరోజ్ ,
తన్వి నేగి , నందిని ప్రధాన పాత్రలలో వి. యశస్వీ దర్శకత్వంలో "సిద్ధార్థ్ రాయ్" అనే
మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ ని ఈ సంవత్సరం
ఫిబ్రవరి 23 వ తేదీ న
థియేటర్ లలో విడుదల చేశారు. ఇకపోతే ఈ
సినిమా విడుదలకు ముందు ఈ
మూవీ బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు
అర్జున్ రెడ్డి సినిమాను పోలి ఉండడంతో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడుమ
థియేటర్ లలో విడుదల అయిన ఈ
మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది.
దానితో ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ప్రభావాన్ని చూపలేదు. ఇక ఈ
మూవీ చివరగా
బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ప్రేక్షకులను అలరించడంలో
బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలం అయిన ఈ
సినిమా మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ
మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఆహా "ఓ టి టి" సంస్థ వారు దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాని మే 3 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ
పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే
థియేటర్ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ
సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.