తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన
యువ హీరోలలో ఒకరు అయినటువంటి
విజయ్ దేవరకొండ తాజాగా ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి తెలుగు పరిశ్రమలో దర్శకుడిగా మంచి క్రేజ్ కలిగి ఉన్న వారిలో ఒకరు అయినటువంటి
పరుశురామ్ పేట్ల దర్శకత్వం వహించగా ... ప్రస్తుతం
టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస
సినిమా అవకాశాలతో ఫుల్
జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న మృనాల్ ఠాకూర్ ఈ
మూవీ లో
విజయ్ దేవరకొండ కి జోడిగా నటించింది.
గోపి సుందర్ సంగీతం అందించిన ఈ
మూవీ ని
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఈ
మూవీ ని ఏప్రిల్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ
మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ
సినిమా కొన్ని రోజుల క్రితమే
అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇక
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచిన ఈ
సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. దానితో ప్రస్తుతం ఈ
సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో
ఇండియా వ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఇలా
థియేటర్ లలో ఫట్ అయిన ఈ
సినిమా "ఓ టి టి" లో మాత్రం హిట్ అయినట్లే కనిపిస్తోంది.