ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర బృందం ఈ సినిమా యొక్క ప్రచారాలను కూడా మొదలు పెట్టింది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేయగా నిన్న ఈ మూవీ లోని మొదటి పాటను విడుదల చేసింది.
ఇక ఇప్పటి వరకు ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇక మొదటి నుండి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడం , ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ప్రచార చిత్రాలు , పాటలు ఉండడంతో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా హక్కులను ఈ మూవీ యూనిట్ అమ్మి వేసింది. ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా హక్కులను ఏ ఏ క్రియేషన్స్ వారు సొంతం చేసుకున్నారు.
ఇక ఇప్పటికే వీరు ఈ సినిమా నార్త్ అమెరికా హక్కులను దక్కించుకోవడంతో ఈ ఏరియాలో ఈ మూవీ ని భారీ ఎత్తున విడుదల చేయడానికి ఈ సంస్థ వారు ప్రస్తుతం ప్రణాళికలను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.